ఉద్యోగం ఇప్పిస్తానని యువతిపై అత్యాచారం

యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రెండు సంవత్సరాలుగా ఓ కామాంధుడు ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండ పీఎస్‌ పరిధిలో ఈ జరిగిందీ ఘటన. బాధితురాలు షీటీమ్స్‌ సిబ్బందికి  ఫిర్యాదు చేయడంతో మంగళవారం నిందితుడిని పోలీసులు అరెస్టు  చేశారు. హన్మకొండ కుమార్‌పల్లికి చెందిన మాడుగుల శంకర్‌ వరంగల్‌లోని ఓ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థినికి రెండు సంవత్సరాల క్రితం పరిచయమయ్యాడు. తన ఆర్థిక పరిస్థితి బాగా లేదని ఉద్యోగం చేస్తానని విద్యార్థిని శంకర్‌ను కోరడంతో తనకు తెలిసిన వ్యక్తులు ప్రభుత్వ శాఖల్లో ఉన్నతస్థాయిలో ఉన్నారని శంకర్‌ ఆ యువతిని నమ్మించాడు. ఉద్యోగం పేరుతో యువతిని  లొంగదీసుకుని రెండు సంవత్సరాలుగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. చివరికి మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు ఇటీవల షీటీమ్స్‌ సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు ప్రారంభించారు. మంగళవారం నిందితుడు శంకర్‌ కొత్తబస్టాండ్‌ సమీపంలో ఉన్నట్లు తెలుసుకొని అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా తప్పును ఒప్పుకున్నాడు. యువతిని మోసం చేసిన శంకర్‌ను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన షీ టీమ్స్‌ సీఐ శ్రీనివాస్‌రావు, సిబ్బందిని సెంట్రల్‌జోన్‌ డీసీపీ పుష్ప అభినందించారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!