హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు నమ్మిన బంటు ఆయన. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సీఎంవోలో ప్రజాసంబంధాల అధికారిగా ఉన్నాడు. ఆయన పనితీరును మెచ్చిన కేసీఆర్.. ట్రాన్స్‌కోలో ఉన్నత పదవీని అప్పగించారు. అంతటి నమ్మకస్థుడైన సీఎంవో పీఆర్వో గటిక విజయ్‌కుమార్‌ను సీఎం కేసీఆర్ తొలగించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆయన వ్యవహార శైలియే వేటుకు కారణంగా తెలుస్తోంది. ఆయనపై కొందరు టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వాటిపై విచారణ చేసిన తర్వాత విజయ్ కుమార్‌పై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. విజయ్ కుమార్ ట్రాన్స్‌కోలో ఉన్నత ఉద్యోగంలో ఉన్నాడు. పీఆర్వోగా తొలగించడంతో.. ఆ ఉద్యోగం ఉంటుందా? లేదా? అనేది చర్చనీయాంశమైంది. కాగా, తొలగింపు వార్తల నేపథ్యంలో గటిక విజయ్‌కుమార్ స్పందిచారు. వ్యక్తిగత కారణాలతో సీఎం పీఆర్వో పదవీకి రాజీనామా చేశానంటూ ఆయన పేరుతో ఒక సందేశం వాట్సాప్ గ్రూప్‌ల్లో చక్కర్లు కొడుతోంది. పీఆర్వో అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు అందులో ఉంది. కాగా, గటిక విజయ్ కుమార్‌ది వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ స్వస్థలం. పలు చానళ్లలో రిపోర్టర్‌గా విధులు నిర్వహించిన ఆయన.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే సీఎం కేసీఆర్ తన పీఆర్వోగా నియమించుకున్నారు.