రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిన్నారి దీక్షిత్‌రెడ్డి కిడ్నాప్, హత్యకేసు నిందితుడు మందసాగర్‌కు వరంగల్ కేంద్రకారాగారంలో కరెంట్ షాక్ కొట్టింది. ప్రస్తుతం అతడు జైలులో విచారణఖైదీగా ఉన్నాడు. అత్యంత భద్రత మధ్య బ్యారక్‌లో ఉంటున్నాడు. మంగళవారం మందసాగర్ అనుమతితో కుటుంబసభ్యులతో ఫోన్లో మాట్లాడాడు. తిరిగి బ్యారక్‌కు వెళ్లే సమయంలో కరెంట్ స్వీచ్‌ను ముట్టుకున్నాడు. వెంటనే కిందపడ్డాడు. దీంతో అతడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మందసాగర్‌కు ఎలాంటి ప్రాణప్రాయం లేదని తెలుస్తోంది.