మానుకోట న్యూస్, ఫిబ్రవరి 21: అప్పుల బాధలు తట్టుకోలేక మనోవేదనతో ఓ గిరిజన రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మానుకోట జిల్లా గూడూరు మండలం రాజనపల్లి కాలనీతండాకు చెందిన ధరావత్ రాములు (52) ఆదివారం పురుగుల మందు తాగి అఘాయిత్యం చేసుకున్నాడు. రాములుకు నలుగురు కుమార్తెలు.. వారిలో ముగ్గురికి వివాహం చేశాడు. మరో కుమార్తె పెళ్లికి సన్నాహాలు చేసే క్రమంలో రూ.3 లక్షల వరకు అప్పులు చేశాడు. దీంతో తనకున్న రెండెకరాల వ్యవసాయ భూమిని సాగు చేసేందుకు పెట్టుబడులు లేవు. చేసిన అప్పులను తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నాడు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన రాములు.. పంట పొలంలో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.