మహబుబాబాద్ జిల్లా సీరోలు ఎస్సై రాణాప్రతాప్‌పై వేటుపడింది. ఓ కేసు విషయంలో రోడ్డుపైనే ఒక వ్యక్తిని లాఠీతో చితకబాదిన ఘటన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సంఘటనపై ఎస్సీ కోటిరెడ్డి విచారణకు ఆదేశించారు. ఎస్సై రాణాప్రతాప్‌ను ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారు. విచారణాధికారిగా తొర్రూర్ డీఎస్పీని నియమించారు.