కట్టుకున్న భార్యే తన భర్తను రోకలిబండతో కొట్టి చంపేసింది. మద్యం సేవించి ఇబ్బందులు పెడుతుండటంతో కొపోద్రిక్తురాలైన ఆమె.. దారుణానికి ఒడిగట్టింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. వరంగల్ జిల్లాకు చెందిన శ్యామ్‌సుందర్-సరోజ దంపతులు మూడేళ్ల క్రితం వలసవచ్చి నివాసిస్తున్నారు. వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న శ్యామ్ సుందర్ మద్యానికి బానిసైయ్యాడు. తన భార్య సరోజ ఎంత చెప్పిన వినకుండా ప్రతిరోజు గోడవచేసేవాడు. ఆదివారం రాత్రి బాగా తాగివచ్చి భార్యను తిడుతూ దారుణంగా కొట్టాడు. ఈ సమయంలో పక్కనే ఉన్న రోకలిబండతో తలపై బలంగా కొట్టింది. దీంతో శ్యామ్‌సుందర్ మృతి చెందాడు.