మానుకోట జిల్లా నూతన కలెక్టర్‌గా కె. శశాంక నియమితులయ్యారు. గతంలో కరీంనగర్ కలెక్టర్‌గా విధులు నిర్వహించిన ఆయన.. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రభుత్వం బదిలీ చేసింది. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న శశాంకను మానుకోట కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. కలెక్టర్‌గా అదనపు బాధ్యతల చూస్తోన్న అభిలాష అభినవ్‌ను రిలీవ్ చేసింది. రాష్ట్రంలో 14 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.