మానుకోట న్యూస్: అనారోగ్యంతో మృతి చెందిన ఓ యువకుడి కుటుంబానికి డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ సీఎం సహాయ నిధి చెక్కును అందజేశారు. దంతాలపల్లి మండలంలోని రామనుజపురం గ్రామానికి చెందిన మల్లం నవీన్ కుమార్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.22 వేలు మంజూరు అయ్యాయి. ఈ మేరకు ఆ చెక్కును ఎమ్మెల్యే రెడ్యానాయక్ మృతుడు నవీన్ సోదరుడు ప్రవీణ్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు మండల కోఆర్డినేటర్ వలాద్రి మల్లారెడ్డి, తదితరులు ఉన్నారు