ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగులకు శుభవార్త. ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను కల్పించేందుకు గురువారం(ఈనెల 10న) హన్మకొండ ములుగురోడ్డులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి మల్లయ్య తెలిపారు. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలో బిజినెస్ ఎగ్జిక్యూటివ్, ఔట్‌లెట్ ఇన్‌చార్జీ పోస్టుల ఎంపిక చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇంటర్, డిగ్రీ అర్హత గల అభ్యర్థులు తమ బయోడేటాతో గురువారం ఉదయం 10.30 గంటలకు తమ కార్యాలయంలో జరిగే జాబ్‌మేళాకు హాజరుకావాలని సూచించారు. పూర్తివివరాలకు 8247656365 నంబర్‌ను సంప్రదించాలని వివరించారు.