ప్రవీణ్ కుమార్ పై విష ప్రచారం.. హిందువులకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయిస్తున్నారంటూ ఫేక్ వీడియో సృష్టి.

హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా గురుకుల విద్యా సంస్థ కార్యదర్శి, సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రతిజ్ఞ చేస్తున్నట్టు కొందరు విష ప్రచారం చేస్తున్నారు. ఓ నకిలీ వీడియోను సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్న ఒక కార్యక్రమంలో స్వైరోస్
ప్రతిజ్ఞ చేస్తున్న వీడియోకు వివాదాస్పద ఆడియోను జత చేసినట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు వ్యతిరేకంగా కొందరు ఉద్దేశపూర్వకంగా దీన్ని రూపొందించారని, వారిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు స్వైరోస్ సిద్ధమవుతున్నారు. మరోవైపు దీనిపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. “స్వేరోయిజం ఏ మతానికి ఏ కులానికి వ్యతిరేకం కాదు..” అని సోమవారం (మార్చి 15, 2021) సాయంత్రం తన ట్విట్టర్ లో చెప్పారు.

SWAEROES (Social Welfare Aeroes) ఏరోస్ అంటే ఆకాశం అని గ్రీకులో అర్థం. సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో విద్యను అభ్యసిస్తున్న, అభ్యసించి ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డ పూర్వ విద్యార్థులను స్వైరోస్ అంటారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!