కుర‌విలో దారుణం.. బాలికను గ‌ర్భ‌వ‌తిని చేసిన బాబాయ్!

బాలికపై బాబాయ్ దారుణానికి ఒడిగ‌ట్టాడు. ఆమెపై అత్యాచారం చేసి గ‌ర్భ‌వ‌తిని చేశాడు. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలంలోని ఓ గ్రామంలో జ‌రిగిందీ ఘ‌ట‌న. ఓ తండాకు చెందిన బాలిక (13) పక్క జిల్లాలోని ఓ పాఠశాలలో చదువుతోంది. కరోనాతో పాఠశాలకు సెలవు ఉండడంతో ఇంటి వద్దే ఉంటోంది. ఇదే తండాకు చెందిన వరుసకు బాబాయి అయ్యే వ్యక్తి బాలికను మభ్యపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పలేదు. మంగళవారం కళ్లు తిరిగి కిందపడిపోవడంతో మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు బాలిక గర్భవతిగా నిర్ధారించారు. దీనిపై తల్లిదండ్రులు కుమార్తెని గట్టిగా అడగడంతో ఈ దారుణానికి పాల్పడింది వరుసకు చిన్నాన్న అయ్యే వ్యక్తి అనే చెప్పింది. దీనిపై కురవి పోలీస్‌స్టేషన్‌లో బుధవారం పోక్సో చట్టం కింద కేసు నమోదైంది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *