మానుకోట జిల్లా అమన్‌గల్‌లో ప్రాథమిక ఆరోగ్యకేంద్ర నిర్మాణానికి స్థలం ఉచితంగా ఇచ్చిన వ్యక్తి కాళ్లను స్థానిక ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మొక్కారు. పీహెచ్సీ ఏర్పాటుకు ప్రభుత్వం స్థలం లేకపోవడంతో రైతు వద్ది సుదర్శన్‌రెడ్డి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి.. రూ.30 లక్షల విలువైన 24 గుంటల భూమిని విరాళంగా ఇచ్చారు. పీహెచ్సీ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకర్‌నాయక్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రైతు సుదర్శన్‌రెడ్డికి పాదాభివందనం చేశారు.