మహబూబాబాద్ కలెక్టర్ విపి.గౌతం ను సీనియర్ ఐపీఎస్ అధికారి, సాంఘీక, గిరిజన సంక్షేమ గురుకులాల విద్యాసంస్థ కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ అభినందించారు. ఎస్సీ విద్యార్థులను ప్రోత్సహించాలన్న లక్ష్యంగా కలెక్టర్ చదువులో అత్యంత ప్రతిభ కనబరచి దేశంలోనే అత్యుత్తమ కాలేజీల్లో ప్రవేశాలు పొందిన జిల్లాకు చెందిన ఆరుగురు పేద ఎస్సీ విద్యార్థులకు ల్యాప్ టాప్ లను అందించారు. దీనిపై ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ.. మీలాంటి సివిల్ సర్వెంట్లే ఈ దేశానికి ఆశాకిరణం. విద్యార్థులు మరెన్నో అద్భుతమైన విజయాలు సాధించాలని కోరుకుంటున్నా.. అని ట్వట్టర్ ద్వారా ప్రశంసించారు.