మానుకోట న్యూస్(దంతాలపల్లి ప్రతినిధి): మానుకోట జిల్లా దంతాలపల్లి మండలం వేములపల్లి గ్రామంలో ధ్యానం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ వలాద్రి ఉమా మల్లారెడ్డి ఆదివారం పరిశీలించారు. తూకం వేస్తున్న తీరును రైతులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన వారిలో రైతుబంధు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ వలాద్రి మల్లారెడ్డి, మల్లం ప్రవీణ్, మల్లం సురేష్, మహిపాల్ రెడ్డి, తదితరులున్నారు.