ఓ వైద్యాధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఏకంగా కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేశారు. డోర్నకల్ తహసీల్దార్ కార్యాలయంలో వెలుగులోకి వచ్చిందీ ఘటన. ఇటీవల ఈ కార్యాలయానికి ఏడు దరఖాస్తులు వచ్చాయి. అందులో స్థానిక ప్రభుత్వాస్పత్రి వైద్యుడు గెజిటెడ్ సంతకం చేసినట్లు ఉంది. ఆ వైద్యుడికి తహసీల్దార్ ఫోన్ చేయగా.. తాను సంతకం చేయలేదని చెప్పారు. ఈ వ్యవహరంలో తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రమేయమున్నట్లు తెలుస్తోంది. అందుకే అధికారులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.