తన కుమారుడు దీక్షిత్‌రెడ్డిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన మందసాగర్‌కు మరణ శిక్ష విధించాలని దీక్షిత్‌రెడ్డి తండ్రి రంజిత్‌రెడ్డి డిమాండ్ చేశారు. నిందితుడికి మరణశిక్ష విధిస్తేనే తన కుమారుడి ఆత్మకు శాంతి చేకూరుతుందని ఆయన అన్నారు. పోలీసులు నిందితుడిని పూర్తిస్థాయిలో విచారిస్తే మిగతా నిందితుల పేర్లు బయటకు వచ్చే అవకాశముందని చెప్పారు. మహబుబాబాద్ మునిసిపాలిటీ పరిధి శనిగపురంలో రంజిత్‌రెడ్డి బుధవారం విలేకరులతో మాట్లాడారు.