హైద‌రాబాద్‌లో పంచేస్తున్నారు!

  • ఓటుకు రూ.500 నుంచి రూ.1000 వ‌ర‌కు పంపిణీ
  • బ‌స్తీ ఓటర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకుంటున్న పార్టీలు
  • గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎంతో నేరుగా ఖాతాల్లోకి
  • ఇప్ప‌టికే స‌గం ఓట‌ర్ల‌కు మేర పంపిణీ
మౌలాలిలోని ఓ బియ్యం షాప్‌నుంచి బ‌స్తాను తీసుకెళ్తున్న ఓట‌రు

హైద‌రాబాద్‌లో ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు శ‌థ‌విధాల ప్ర‌య‌త్నిస్తున్నాయి. పోలింగ్‌కు ఒక్క రోజు గ‌డువు ఉండ‌టంతో ప్ర‌లోభాల ప‌ర్వానికి తెర‌లేపాయి. ఒక్కో డివిజ‌న్‌లో ఒక్కో ర‌కంగా డ‌బ్బులు పంపిణీ చేస్తున్నాయి. ఒక్కో ఓటుకు రూ.500 నుంచి రూ.1000 వ‌ర‌కు ముట్ట‌జెప్పుతున్నాయి. కొన్ని డివిజ‌న్‌ల‌లో ఎవ‌రికి అనుమానం రాకుండా ఉండేందుకు డ‌బ్బుల‌ను గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం ఖాతాల్లో జ‌మ‌చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికే సంగం మంది ఓట‌ర్ల‌కు డ‌బ్బులు పంపిణీ చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే, ఈ పంచుడు కార్య‌క్ర‌మంలో గొడ‌వలు జ‌రుగుతున్నాయి. ఒక‌పార్టీ అభ్య‌ర్థులు పంపిణీ చేస్తున్న డ‌బ్బుపై.. మ‌రో పార్టీ కార్య‌క‌ర్త‌లు ఫిర్యాదులు చేస్తున్నారు. అంత‌టితో ఆగ‌కుండా దాడులు కూడా చేసుకుంటున్నారు.

ఓటుకు 25 కిలోల బియ్యం
బ‌స్తీ ప్రాంతాలు ఎక్కువ‌గా ఉండే డివిజ‌న్ల‌లో ఓట‌ర్ల‌కు అభ్య‌ర్థులు బియ్యంతో గాలంవేస్తున్నారు. ఒక్కో ఓటుకు 25 కిలోల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ఇంట్లో రెండు ఓట్లు ఉంటే.. 50 కిలోలు ఇస్తున్నారు. బియ్యం అంద‌జేత కూడా ప‌క‌డ్బందీగా చేస్తున్నారు. ఇవ్వాల‌నుకున్నా ఓట‌ర్‌కు రూ.10 నోటు మీద రాసి ఇస్తున్నారు. ఆ నోట్‌ను సంబంధిత షాప్ యాజమానికి ఇస్తే స‌రిపోతుంది. ఆయ‌న బియ్యం బ‌స్తాల‌ను ఇస్తాడు. ఇలా మౌలాలి డివిజ‌న్‌లో పంపిణీ జ‌రుగుతోంది. ఎక్కువ ఓట్లున్న కుటుంబాల‌కు టీవీ, రిప్రిజిరేట‌ర్ల‌తో ప్ర‌లోభ‌పెడుతుండ‌టం గ‌మ‌నార్హం.

జోరుగా మ‌ద్యం
జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో మ‌ద్యం గుప్పుమంటోంది. ప్ర‌చారం ముగిసిన త‌ర్వాత మ‌ద్యం దుకాణాలు బంద్ చేయ‌డంతో.. ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్తులు ముందుగానే కొనుగోలు చేసి పెట్టుకున్నారు.వాటిని సోమ‌, మంగ‌ళ‌వారాల్లో పంపిణీ చేస్తారు. అంతేకాదు, త‌మ వెంట తిరిగిన అనుచ‌రుల కోసం ప్ర‌త్యేక బాటిళ్ల‌ను అందుబాటులో ఉంచారు. ప్ర‌తి డివిజ‌న్‌లోని త‌మ అనుచ‌రులు, బంధువుల ఇళ్ల‌లో భ‌ద్రంగా దాచిపెట్టారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *