నర్సంపేట ఏసీపీ పణిదర్ ,సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుమ్మల్ లు పాడేమోసారు. తమ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించే మహేష్ కు కన్నీటి వీడ్కోలు పలికారు. వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం రామచంద్రపురానికి చెందిన కానిస్టేబుల్ బర్ల మహేష్ (35) నర్సంపేట పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున చెన్నారావుపేట మండలంలోని లింగగిరి గ్రామ శివారులో ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో ఆయన మృతి చెందాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి స్వగ్రామం సంగెం మండలం రామచంద్రపురం తరలించారు. నర్సంపేట ఏసీపీ ఫణిదర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుమ్మల్, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొని మృతదేహం పై పూలమాలలు వేసి నివాళులర్పించారు. కానిస్టేబుల్ పాడెను మోసి కన్నీటి వీడ్కోలు పలికారు.