ఆరేళ్లచిన్నారిపై ఇద్దరు కామాంధులు అత్యాచారయత్నానికి ఒడిగట్టారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వారిద్దరిని స్థంభానికి కట్టేసి కొట్టారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని జరిగిందీ దారుణం. స్థానికంగా ఉండే అంజి, నర్సింములు ఆరేళ్లచిన్నారిపై కన్నేశారు. ఆదివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో లైంగికదాడికి యత్నించగా ఆ చిన్నారి కేకలు వేసింది. అక్కడికి చేరుకున్న స్థానికులు వారిద్దరిని స్థంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. బాలికను చికిత్స కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. బాధిత బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదుమేరకు అంజి, నర్సింములపై కేసు నమోదుచేశారు.