జంప‌న్న‌వాగులో మునిగి వ్య‌క్తి మృతి

ములుగు, అక్టోబ‌ర్ 27(మానుకోట న్యూస్ డెస్క్): ములుగు జిల్లా తాడ్వాయి మండ‌లం స‌మ్మ‌క్క‌-సార‌క్క గ‌ద్దెల స‌మీపంలోని జంప‌న్న వాగులో నీట మునిగి ఒక‌రు మృతి చెందారు. అత‌డు హైద‌రాబాద్‌కు చెందిన వ్య‌క్తిగా పోలీసులు గుర్తించారు. స‌మ్మ‌క్క‌-సార‌క్క ద‌ర్శ‌నానికి వ‌చ్చిన ఆ వ్య‌క్తి.. జంప‌న్న‌వాగులో స్నానం చేయ‌డానికి వెళ్లాడు. ప్ర‌మాద‌వ‌శాత్తూ నీట మునిగాడు. అత‌డికి ఈత‌రాక‌పోవ‌డంతో మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న తాడ్వాయి పోలీసులు.. ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *