సోషల్‌మీడియాపై సీఎం కేసీఆర్ ద్వజమెత్తారు. కేసీఆర్‌ను బద్నాం చేయడానికి ఇష్టం వచ్చినట్లు సోషల్‌మీడియాలో పోస్టులు చేస్తున్నారని ఆయన విమర్శించారు. జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదిక ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. “సోషల్ మీడియా. యాంటీ సోషల్మీడియాలాగా తయారైంది. వాస్తవాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు పోస్టులు చేస్తున్నారు. ఇది మంచి మంచి పద్దతి కాదు.” అని సీఎం కేసీఆర్ అన్నారు.