- ప్రీ ప్రోగ్రామ్ తో సెట్ చేశారు
- వీవీప్యాట్ లను లెక్కించండి తెలిసిపోతుంది
- ఈవీఎం హ్యాకర్ సయ్యద్ షుజా ఆరోపణ
- ఈసీ మౌనంతో బలపడుతున్న అనుమానాలు
లాక్డౌన్ కాలంలో ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొన్నది బిహార్ వాసులే. దాదాపు అన్ని రాష్టాలలో విస్తరించిఉన్న బిహారీలు తమ స్వస్తలాలకు కాలినడకన నడిచి వచ్చిన ఘటనలు, మార్గమాద్యలో ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు, తమ గురించి బిహార్ ప్రభుత్వం ఏమీ చేయలేదన్న నిరుపేదల శాపనార్థాలు ఇంకా మనందని కళ్లముందే మెదులుతున్నాయి. వీటితోపాటు రాష్ట్రంలో నిరుద్యోగం పతాక స్థాయికి చేరడంతో పాలకులపై యువకుల్లో తీవ్ర ఆగ్రహం నెలకొనిఉంది. ఈ నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో జేడీయు, బీజేపీలతో కూడిన ఎన్డీఏ మట్టికరవాల్సిందే. దాదాపు ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా ఇదే చెప్పాయి. యువనేత తేజస్వీ యాదవ్ ఆధ్వర్యంలోని ఆర్జేడీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులతో కూడిన మహా కూటమి విజయం ఖాయమని తేల్చేసాయి. కానీ ఫలితాల్లో జరిగిందేమిటో మనం చూస్తున్నాం. ఇది మోదీ మాయ, బీజేపీ విజయం అని మీడియా కీర్తిస్తుండగా.. ఇది ముమ్మాటికి ఈవీఎం ల హ్యాకింగ్ వల్ల సాధ్యమైన విజయమని ఈవీఎం హ్యాకర్ సయ్యద్ షుజా ఆరోపిస్తున్నాడు. హైదరాబాద్లోని ఈవీఎంల తయారీ కేంద్రమైన ఈసీఐఎల్ (ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్)లో ఇంజినీయర్ గా పనిచేసిన ఈయన 2014, 2019 సాధారణ ఎన్నికల్లోనూ బీజేపీ ఇదేవిధంగా ఈవీఎంల హ్యాకింగ్ ద్వారానే స్వంతంగా మెజారిటీ సీట్లను సాధించిందని ఆరోపించాడు. బీజేపీతో తనకు ప్రాణహాని ఉండటంతో అమెరికాలో తలదాచుకున్నానని చెబుతున్న సయ్యద్ షుజా బిహార్ ఎన్నికల ఫలితాల రోజు రోజంతా ఫేస్ బుక్ ద్వారా లైవ్ లో మాట్లాడారు. అనేకమంది లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఇది నిజం కాదని, ఈవీఎంలను హ్యాక్ చేయడం అసాధ్యమని చెబుతూ వస్తున్న ఎన్నికల సంఘం (ఈసీ) సయ్యద్ షుజా చేస్తున్న ఆరోపణలన్నిటిపై స్పందించకపోవడం అనేక అనుమానాలు కలుగుతున్నాయి.
ప్రజల ప్రశ్నలకు సయ్యద్ షుజా సమాధానాలివి..
ఈవీఎంల హ్యాకింగ్ సాధ్యమేనా..?
# ముమ్మాటికీ సాధ్యమే. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఈవీఎంలు హ్యాక్ చేసే అవకాశాలు ఉన్నందునే అగ్రరాజ్యంగా పేరొందిన అమెరికా సైతం నేటికీ బ్యాలెట్ పత్రాలనే వినియోగిస్తుంది. జర్మనీ నెదర్ల్యాండ్స్ ఈవీఎంల వినియోగాన్ని వ్యతిరేకించగా, రష్యా, మంగోలియా, బంగ్లాదేశ్, ఇండోనేషియా, ఇక్వడార్ దేశాల్లో ఇంకా ప్రయోగాత్మక పరిశీలనలోనే ఉన్నాయి. ఆస్టేలియా, ఇటలీ, నార్వే, యుకే, ఐర్లాండ్ ఫిలిప్పీన్్స లాంటి పలు దేశాలు వీటిని పరిశీలించిన తర్వాత వాడవద్దని నిర్ణయించాయి. భారత్ కంటే టెక్నాలజీ, అభివృద్దిలో ఎంతో ముందున్న ఈ దేశాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి..? ఈవీఎంలు సురక్షితమే అని గుడ్డిగా వాదించేవారు ఈ విషయాన్ని ఒకసారి ఆలోచించాలి.
బిహార్ ఎన్నికల్లో ఈవీఎం ఫలితాలను ఎలా మార్చారు..?
కాకుండా ఎలక్ట్రానిక్ వస్తువుల బిహార్ ఎన్నికల్లో 49శాతం ఈవీఎంలను ప్రీ ప్రోగ్రాం చేశారు. ఇది బీజేపీ అభ్యర్థులు పోటిచేస్తున్న స్థానాల్లో 37శాతం, జేడీఈ స్థానాల్లో 12శాతంగా ఉంది. దీనిద్వారా మొత్తం పోలైన ఓట్లలో ఎన్నయినా తమ అభ్యర్థులకు మార్చుకోవచ్చు. ప్రీ ప్రొగ్రాం చేశాక ఈ పనిని ఎక్కడినుంచైనా చాలా సులభంగా చేయవచ్చు. ఉదాహరణకు.. ఒక ఈవీఎంలో 4వేల ఓట్లు ఉంటే పోటిచేసిన నలుగురు అభ్యర్థులకు ఒక్కొక్కరికి 1000 చొప్పున సమానంగా పడ్డాయనుకుందాం. ప్రీ ప్రోగ్రాం చేసిన ఈవీఎంలలో వీటిని మార్చుకోవచ్చు. మొత్తం 4వేల ఓట్లు ఒకే అభ్యర్థికి వస్తే తమ మోసం తెలిసిపోతుందని మెజారిటీ 50-80 శాతం ఓట్లనే పడేలా చేస్తారు. తమకు మెజారిటీ ఓట్లు వస్తాయని భావించిన ప్రాంతాల్లో ఈవీఎంల జోలికి వెళ్లరు. ప్రత్యర్థి వర్గం బలంగా ఉన్నచోట, తమ అభ్యర్థి బలహీనంగా ఉన్న ప్రాంతాల్లోనే ఈవీఎంల ప్రీ ప్రోగ్రామింగ్ ఉంటుంది. బిహార్ లోనూ ఇదే జరిగింది. తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బలంగా ఉన్నచోటనే ఈవీఎంలను ఏమార్చారు.
ఒక ఓటరుగా ఈ మోసాన్ని బహిర్గతం చేయడం ఎలా..?
చాలా సులభం. ఈవీఎంల ద్వారా వెల్లడైన ఓట్లను 100% వీవీ ప్యాట్ల ఓట్లతో సరిచేస్తే నేను చెబుతోంది నిజమో అబద్దమో తెలిసిపోతుంది. కాని దీనికి ఎన్నికల సంఘం కూడా సిద్దంగా లేదు. ఫలితాలు ఆలస్యం అవుతాయన్న వంకతో ఇలా చేయలేమని 2019 జనరల్ ఎలక్షన్స్ కంటే ముందు ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఓట్ల లెక్కింపు సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయడం ముఖ్యమా..? ఓటర్ల అనుమానాలు నివృత్తి చేసి, ఫలితాలు పారదర్శకంగా ప్రకటించడం ముఖ్యమా..? 100శాతం వీవీప్యాట్లు లెక్కిస్తే ఫలితాలు ప్రకటించడం ఒకటి రెండు రోజుల ఆలస్యం అయితే ఏమవుతుంది..? మమోసం చేసి ఐదేళ్లు అధికారంలో ఉండటం కంటే.. రెండు రోజుల ఆలస్యం పెద్ద విషయం కాదుకదా. ఫలితాలు అదేరోజు పూర్తి చేయడం కంటే ప్రజలు వేసిన ఓట్లు ఎవరికి పడ్డాయన్న విషయాన్ని కూడా తెలుసుకోకుండా, ఎన్నికల్లో పారదర్శకత పాటించకుండా ఎన్నికల సంఘమే అడ్డుపడటం వెనక కారణాలను అర్ధం చేసుకోవచ్చు.