క‌వ‌ల‌ల‌ను పెళ్లిచేసుకున్న క‌వ‌ల‌లు

మానుకోట న్యూస్‌: క‌‌వ‌ల‌ల‌ను క‌వ‌ల‌లే పెళ్లి చేసుకున్నారు. మానుకోట జిల్లా కేస‌ముద్రం మండ‌లం వెంక‌ట‌గిరి గ్రామంలో జ‌రిగిందీ అరుదైన ఘ‌ట‌న. క‌వల‌‌లైన అక్కాచెళ్ల‌ళ్ల‌ను, క‌వల‌‌లైన అన్న‌దమ్ములు ల‌గ్గం చేసుకున్నారు. స్థానికంగా ఉండే అంబాల మ‌ల్లిఖార్జ‌న్, సుజాత దంప‌తుల‌కు.. న‌రేశ్-మ‌హేశ్ క‌వ‌ల‌లున్నారు. డిగ్రీ పూర్తిచేసిన వారు.. వ్య‌వ‌సాయం చేస్తున్నారు. హైద‌రాబాద్‌లో మ‌ధ్య‌త‌ర‌గ‌తికి చెందిన నేరేళ్ల వీర‌భ‌ద్రం-మంగ‌మ్మ దంప‌తుల‌కు శాంతి- ప్ర‌శాంతి క‌వ‌ల ఆడ‌పిల్లున్నారు. ఆ క‌వ‌ల జంట‌ల‌కు వెంక‌ట‌గిరిలో గురువారం వివాహం జ‌రిగింది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *