తరగతి గదిలో టీనేజీ ప్రేమికుల లగ్గం.

వాళ్లిద్దరూ మైనర్లు. ఇంటర్ చదువుతున్నారు. ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. వారి ప్రేమ అంతటితో ఆగలేదు.. కాలేజీ నడుస్తున్న సమయంలోనే తరగది గదిలోనే పెళ్లి చేసుకున్నారు. అమ్మాయికి పసుపుతాడు కట్టి, నుదిటిపై బొట్టు పెట్టాడు అబ్బాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జరిగిందీ తరగతి గది పెళ్లి. గత నెల 17న జరిగిన ఈ పెళ్లి ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ పెళ్లి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అవి కాలేజీ ప్రిన్సిపాల్ వరకు వెళ్లాయి. విషయం తెలుసుకున్న కాలేజీ ప్రిన్సిపాల్ ఇద్దరు విద్యార్థులకు గట్టి వార్నింగ్‎ ఇచ్చారు. అంతేకాదు వీరికి సహాయం చేసిన మరో విద్యార్థికి కూడా టీసీ ఇచ్చి కాలేజీ నుంచి పంపిచారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *