మా గురించి

ప్ర‌సార మాధ్య‌మాల విస్తృతి రోజురోజుకి విప‌రీతంగా పెరుగుతోంది. జాతీయ‌, అంత‌ర్జాతీయ వార్త‌లు, సంఘ‌ట‌న‌లు క్ష‌ణాల్లో తెలిసిపోతున్నాయి. కానీ.. ప్ర‌తిరోజు మ‌న జిల్లా, మండ‌లం, స్థానికంగా జ‌రుగుతున్న అనేక విష‌యాలు తెలియ‌డం లేదు. ఏదైనా పెద్ద సంఘ‌ట‌న జ‌రిగితేనే ఇప్పుడున్న టీవీ ఛాన‌ళ్లు, వార్త ప‌త్రిక‌ల్లో మ‌న జిల్లా, మండ‌ల వార్త‌లు క‌నిపిస్తాయి. ప్ర‌స్తుతం మీడియా స్థానిక స‌మ‌స్య‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోవ‌డంతో అవి అధికారుల దృష్టికి వెళ్ల‌క‌పోవ‌డంతో ప‌రిష్కారానికి నోచుకోవ‌ట్లేదు. మ‌న జిల్లాలోని గ్రామాలు, ప‌ట్ట‌ణాల్లో నిత్యం ఎన్నో సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నా.. కొన్నే బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. అవే ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల దృష్టికి వెళ్తున్నాయి. మిగ‌తావి మ‌న కండ్ల ముందే కాల‌గ‌ర్బంలో క‌లిసిపోతున్నాయి. పోరాటాల పురిటిగ‌డ్డ మానుకోట జిల్లాలో ఈ ప‌రిస్థితిని మార్చాల‌న్న ల‌క్ష్యంగా పుట్టుకొచ్చిందే www.maaanukotanews.com మ‌హబూబాబాద్ జిల్లాలో జ‌రిగే ప్ర‌తి వార్త‌ను, సంఘ‌ట‌న‌లను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేయ‌డంతో పాటు స్థానిక స‌మ‌స్య‌ల‌ను వెలుగులోకి తెచ్చి.. వాటిని ప‌రిష్క‌రించ‌డమే మా వెబ్‌సైట్ ప్ర‌ధాన ఉద్దేశం.

కేవ‌లం జిల్లా వార్త‌లే ప్ర‌ధానాంశంగా ప్ర‌త్యేకంగా వెబ్ సైట్ ప్రారంభించిన ఘ‌న‌త తెలుగు రాష్ట్రాల‌లో “మానుకోట న్యూస్ డాట్ కాం “ మొట్ట‌మొద‌టిది అని చెప్ప‌డానికి గ‌ర్వంగా ఉంది. దీని ద్వారా మేము స్థానిక వార్త‌లు, సంఘ‌ట‌న‌ల‌తో పాటు రాజకీయ పార్టీలలో అంతర్గత రచ్చ, లోగుట్టు వ్యవహారాలను అందిస్తాం. వివిధ రంగాల్లో రాణిస్తూ ప్రపంచవ్యాప్తంగా విస్త‌రించి ఉన్న మానుకోట జిల్లాకు చెందిన ఆణిముత్యాలను పరిచయం చేస్తాం. జిల్లా, మండ‌ల‌, గ్రామ స్థాయి అధికారుల‌ను నేరుగా సంప్ర‌దించేందుకు వారి ఫోన్ నెంబ‌ర్లు అంద‌రికీ అందుబాటులో ఉంచాం.

అన్నిటికంటే ముఖ్యంగా వార్తల కోసం మరుసటి రోజు దిన‌ప‌త్రిక‌లు వ‌చ్చేంత‌ వరకు నిరీక్షించే అవసరం లేకుండా జిల్లా కేంద్రం నుంచి గ్రామ స్థాయి వరకు ప్రతి వార్తను  క్షణాల్లో మీ ముందు ఉంచుతాం. మ‌న జిల్లాకు స‌రిహ‌ద్దులుగా ఉన్న‌ ఇరుగు-పొరుగు జిల్లాల స‌మాచారం కూడా అందిస్తాం. మానుకోట జిల్లాలో పుట్టి పెరిగి పాత్రికేయరంగంలో రాణిస్తూ.. మ‌న జిల్లా అభివృద్ధిలో పాలుపంచుకోవాల‌న్న ల‌క్ష్యంగా ప్రారంభించిన మానుకోట న్యూస్ డాట్ కాం జిల్లా వాసుల‌తో పాటు ఇత‌ర జిల్లాలు, రాష్ట్రాలు, దేశాల్లో విస్త‌రించి ఉన్న‌, మానుకోటతో అనుబంధ‌మున్న అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంద‌ని ఆశిస్తున్నాం. ఇది మ‌న‌ వెబ్ సైట్.. మ‌న మ‌హ‌బూబాబాద్ జిల్లా వెబ్ సైట్.. మా త‌ప్పిదాలు, లోటుపాట్లు ఎత్తి చూపేందుకు,  దీనిని మ‌రింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు పాఠ‌కులు త‌మ సూచ‌న‌లు, స‌ల‌హాలు, అభిప్రాయాలు  తెలిపేందుకు maanukotanews@yahoo.com కి ఇ-మెయిల్ చేయ‌వ‌చ్చు.

జైహింద్

– Team Maanukotanews.com