మానుకోట న్యూస్: ఆడపిల్ల పుట్టిందని ఆస్పత్రిలోనే ఆడశిశువును వదిలేశారు. అప్పడు జన్నించిన ఆ పసిపాపను అనాథగా మార్చారు. మానుకోట జిల్లా ఆస్పత్రిలో శుక్రవారం జరిగిందీ ఘటన. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఓ గుర్తుతెలియని మహిళ ఆస్పత్రికి వచ్చింది. మొదటి అంతస్తులోని సంజీవిని వార్డులో నర్సు వద్దకు వచ్చి.. పసికందు బరువు తక్కువగా ఉందని, తన తల్లిని తీసుకువస్తానంటూ నర్సు చేతిలో పెట్టి వెళ్లిపోయింది. ఎంతకూ తిరిగిరాలేదు. ఈ విషయం తెలుసుకున్న శిశుసంక్షేమశాఖ అధికారులు.. వైద్యసేవలు అందిస్తున్నారు. పసిపాప పూర్తిగా కోలుకున్న తర్వాత వరంగల్‌లోని శిశువిహార్‌కు తరలిస్తామని వారు చెప్పారు. ఆస్పత్రిలోని సీసీటీవీ కెమెరాల ఆధారంగా పపిపాపను తీసుకువచ్చింది.. ఎవరా అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.