మానుకోట న్యూస్: మహబుబాబాద్ ఎంపీ కవిత మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని దగ్గరుండి తన వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. నెల్లికుదురు – మహబుబాబాద్ మార్గంలోని శ్రీరామగిరి స్టేజి వద్ద బుధవారం జరిగిందీ సంఘటన. ఎంపీ కవిత హైదరాబాద్ మహబుబాబాద్‌కు కారులో వస్తున్నారు. శ్రీరామగిరి స్టేజి వద్ద ఓ ట్రాక్టర్.. బైక్‌ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడికి గాయలయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన ఎంపీ కవిత.. ఆ వ్యక్తిని తన కారులో వెంటనే మహబుబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎంపీ కవిత మానవత్వంపై సోషల్‌మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి. మంత్రి సత్యవతిరాథోడ్ ఆమెను అభినందించారు.