మానుకోట న్యూస్: మహబుబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కు కరోనా సోకింది. నీరసంగా ఉండటంతో ఆదివారం ఆయన కరోనా పరీక్ష చేయించుకున్నారు. పాజిటివ్‌గా నిర్థారణయింది. దీంతో తనతో గత రెండు రోజులుగా సాన్నిహిత్యంగా ఉన్నవారందరూ.. కరోనా పరీక్షలు చేయించుకోవాలని శంకర్‌నాయక్ సూచించారు. ప్రస్తుతం తన ఆరోగ్యపరిస్థితి క్షేమంగా ఉందని, నియోజకవర్గ ప్రజలందరూ ఆందోళన చెందవద్దని తెలిపారు.